లక్షెట్టిపేటలో రైతుల ధర్నా.. ఉద్రిక్తత!

2చూసినవారు
లక్షెట్టిపేటలో రైతుల ధర్నా.. ఉద్రిక్తత!
ధాన్యం కొనుగోలు చేయాలని, మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ ప్రధాన రహదారిపై రైతులు, నాయకులు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, దివాకర్ రావు ఆధ్వర్యంలో 2 గంటలుగా సాగిన ఈ ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగిన ఈ నిరసనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్