మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం తాల్లపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బొజ్జ గంగన్న అనారోగ్యంతో మరణించగా, మంచిర్యాల నియోజకవర్గం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ మంతెన జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు, వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి, రూ.5,000 ఆర్థిక సహాయం శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుర్సెంగ కళావతి- జుగతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, వార్డు సభ్యులు ముత్తె కుమారస్వామి, ఎర్రం లావణ్య - మల్లేష్, నాయకులు మాడ దయాకర్, దావూద్ ఖాన్, ఎర్రం మల్లేష్, గోల్ల సత్తయ్య, పాలకుర్తి ప్రభాకర్, గుమ్మడి అరవింద్, వెంకటేష్, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.