జన్నారం మండల కేంద్రంలోని దేవుని కూడా గ్రామానికి చెందిన వెంకటేష్, 30 జనవరి 2024న ఇరాక్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం, వెంకటేష్ చదువుకున్న ప్రాథమిక పాఠశాలలో అతని స్నేహితుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు షఫీక్, గోవింద్ నాయక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ స్నేహితులు గణేష్, కృష్ణ, అనిల్, సతీష్, మనోహర్, నాని, గణేష్, రాకేష్, సిద్ధూ పాల్గొన్నారు.