దండేపల్లి మండలం మేదరిపేట గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం మాజీ ఎంపీపీ కొంగల నవీన్ కుమార్ స్థానిక నాయకులు, ఉపాధి కూలీలతో కలిసి ఉపాధి హామీ (100) పనిని ప్రారంభించారు. ఈ పథకాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, వేసవిలో తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని, కూలీలు సరైన కొలతలతో పనులు చేసి రోజుకు సుమారు రూ.300 వరకు వేతనం పొందవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చొప్పదండి రాజేష్, బాల్సు వినోద్ కుమార్, కారోబారి పిట్టల సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.