గూడెంలో పోలియో చుక్కలు వేసిన తాజా మాజీ ఎంపీటీసీ తోట మోహన్

548చూసినవారు
గూడెంలో పోలియో చుక్కలు వేసిన తాజా మాజీ ఎంపీటీసీ తోట మోహన్
మంచిర్యాల జిల్లా దండ పెల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఆదివారం పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తాజా మాజీ ఎంపీటీసీ తోట మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లితండ్రుల బాధ్యత అని, 100% పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్