మంచిర్యాల జిల్లాలోని సాయికుంట బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో విద్యార్థులు నిరసన తెలిపారు. వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, పురుగులు, రాళ్లు ఉన్న అన్నం, నీళ్ల పప్పు పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.