మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో కుక్కల గుంపు దాడిలో రెండు లేగదూడలు మృత్యువాత పడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం, సత్యనారాయణ పశువుల కొట్టంపై దాడి చేసిన కుక్కల గుంపు, వారం క్రితం జన్మించిన రెండు లేగదూడలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో ఒక లేగదూడ అక్కడికక్కడే మృతి చెందగా, మరో లేగదూడ ప్రాణాపాయస్థితిలో ఉంది. ఈ ఘటనతో వేంపల్లి వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.