హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఆదివారం మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగించారు. పలు రకాల పీర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిద మతాలకు చెందిన ప్రజలు హాజరై మతసామారస్యానికి అద్దం పట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.