గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలంలో సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ రూపొందించిన కరదీపికలోని అంశాలపై మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.