కన్నెపల్లి మండలం కేంద్రంలో గురుండ్ల సాయి అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్య గురుండ్ల వనితపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వనిత కుడి కాలు, కుడి చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సాయి మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవలు పడుతుంటాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు సమాచారం. బాధితురాలిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.