మంచిర్యాల 4 అంగన్వాడి కేంద్రంలో ICDS దినోత్సవం

0చూసినవారు
మంచిర్యాల 4 అంగన్వాడి కేంద్రంలో ICDS దినోత్సవం
మంచిర్యాల జిల్లాలోని 4వ అంగన్వాడి కేంద్రంలో ICDS (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించారు. 1975 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 106వ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం, 6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం, మరణాల రేటును తగ్గించి, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా టీచర్ కె. విజయలక్ష్మి పథకం ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్