ధాన్యం కొనుగోలులో అక్రమాలు.. ఆరుగురిపై కేసు నమోదు

1చూసినవారు
ధాన్యం కొనుగోలులో అక్రమాలు.. ఆరుగురిపై కేసు నమోదు
జైపూర్ మండలంలోని కిష్టాపూర్ DCMS వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పుడు లెక్కలు చూపించి, ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు దుర్వినియోగం చేసిన నిర్వాహకుడు రమేశ్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీలేఖ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ధాన్యం కొనుగోలు అక్రమాలపై సీఐ నవీన్ కుమార్ విచారణ చేపట్టారు.