శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపిన జనక్ ప్రసాద్

423చూసినవారు
శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపిన జనక్ ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నూతన ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC యూనియన్ సెక్రటరీ జనరల్ డా.బి. జనక్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికుల కనీస వేతనాలు, వారి పని వాతావరణం మెరుగుదల మరియు సంస్థ ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సింగరేణిపై పూర్తి అవగాహన ఉన్న అధికారి కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్