జన్నారం: వడదెబ్బతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

0చూసినవారు
జన్నారం: వడదెబ్బతో భవన నిర్మాణ కార్మికుడు మృతి
జన్నారం మండల కేంద్రానికి చెందిన యాట ఇంద్రయ్య (60) అనే వ్యక్తి రెండు రోజుల క్రితం భవన నిర్మాణంలో కూలీ పని చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. జన్నారంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం జగిత్యాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్