జన్నారం: 127 మందికి షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

348చూసినవారు
జన్నారం: 127 మందికి షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
మంగళవారం జన్నారం మండలంలో 127 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాల కింద చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని తల్లులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్