మేకలకు మేత కోయడానికి చెట్టెక్కిన గంగారాజం అనే కాపరి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఈ సంఘటన జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.