జన్నారం: ఇసుక డంపులు సీజ్

55చూసినవారు
జన్నారం: ఇసుక డంపులు సీజ్
జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో నిలువ ఉంచిన ఇసుక డంపులను గురువారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అక్రమ ఇసుక నిలువలు ఉన్నాయనే సమాచారంతో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఆర్ఐ భానుచందర్, గ్రామ కార్యదర్శి, పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామంలో పరిశీలించారు. 9 చోట్ల అక్రమ నిలువలు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తాసిల్దార్ తెలిపారు. మొత్తం 168 ట్రాక్టర్ల ఇసుక ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్