మంచిర్యాల డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, ప్రజలను రక్షించడానికి పోలీసులు ప్రతిక్షణం పనిచేస్తున్నారని తెలిపారు. లక్షేట్టిపేటలో జరిగిన రహదారి భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. హత్య చేసిన వ్యక్తికి పడే శిక్ష, రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్షేట్టిపేట సర్కిల్ పరిధిలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఏడుగురు మరణించారని ఆయన తెలిపారు.