లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి మునీష్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.