లక్షేట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల రాజీ మార్గమే రాజ మార్గమని పేర్కొన్నారు. ఈ నెల 15న జరిగే మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరుతూ లక్షేట్టిపేట కోర్టు ఆవరణలో పోలీసులు, న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సహకారం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ సమావేశం మంగళవారం జరిగింది.