నకిలీ నోట్ల దందాలో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి ప్రకాష్ తెలిపారు. ఫిబ్రవరి 25న నకిలీ నోట్లకు సంబంధించి లక్షేట్టిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన ముగ్గురిని చాకచక్యంగా అరెస్టు చేసిన ఎస్ఐ గోపతి సురేష్, పోలీసులను ఏసీపీ అభినందించారు.