లక్షేట్టిపేట మండలంలోని తిమ్మాపుర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ముగ్గురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో వార్డు నుంచి చుంచు పోచయ్య, మూడో వార్డు నుంచి గడికొప్పుల అనూష, ఆరో వార్డు నుంచి మెరుగు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.