లక్షేట్టిపేట మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన అడప ఉమ (51) కడుపు, నడుము నొప్పితో నాలుగేళ్లుగా బాధపడుతూ, చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో, ఈ నెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.