లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో ఐకేపీ సీసీలు, పీఏసీఎస్ సీసీలు, సెక్టార్-1 సిబ్బంది, రవాణా గుత్తేదారుతో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా గుత్తేదారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియలు జాప్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు