లక్షెట్టిపేట పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి గోదావరి రోడ్డులోని హనుమాన్ మందిరం వరకు సాగిన ఈ యాత్రలో బ్యాండ్ మేళాలు, హనుమాన్ దీక్షా స్వాముల నృత్యాలు, భక్తుల జయజయధ్వానాలు మార్మోగాయి. దీంతో పట్టణ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.