లక్షేటిపేట మండలంలోని శాంతాపూర్ గ్రామ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రాల ప్రశాంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాలకు పని నిమిత్తం వెళ్ళి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.