పదవ తరగతి జీవితంలో గొప్ప మలుపు వంటిది అని ఎంఈఓ శైలజ పేర్కొన్నారు. లక్షేట్టిపేట మండలంలో టాపర్ గా నిలిచిన శ్రీ నిత్యకు ఆమె పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిరోజు ప్రణాళిక బద్ధంగా చదివి ఉత్తమ
ఫలితాలు సాధించాలని ఆమె పేర్కొన్నారు. ఇష్టపడి చదవాలే తప్పా బలవంతంగా చదవడంతో ఎటువంటి ఉపయోగం ఉండదని వివరించారు.