మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాలలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండల సమాఖ్యలు పాల్గొన్నాయి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.