స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం లక్షేటిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ రమణమూర్తి హాజరై ప్రారంభించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. సీఐ మాట్లాడుతూ దేశ ఐకమత్యానికి ప్రతీకగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకోవాలని పేర్కొన్నారు.