మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం, అనధికార లే అవుట్ల నియమావళి క్రింద ప్రభుత్వ ఉత్తర్వులు 131 ప్రకారం రుసుములు, చార్జీల చెల్లింపులపై 25 శాతం రాయితీ కల్పించారు. ఈ రాయితీని జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల పరిధిలోని ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారులు నిర్ణీత గడువులోగా రుసుము చెల్లించి ఈ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.