మంచిర్యాల: వడదెబ్బతో మరో వ్యక్తి మృతి

2చూసినవారు
మంచిర్యాల: వడదెబ్బతో మరో వ్యక్తి మృతి
దండేపల్లి మండలంలోని రాజుగూడా అనుబంధ జైతూగూడా గ్రామానికి చెందిన ఆత్రం రాజేశ్ వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం కూలీ పనికి వెళ్లిన ఆయనకు వాంతులు, విరోచనాలతో పాటు ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తాలూకాలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది.

సంబంధిత పోస్ట్