మంచిర్యాల: మున్సిపల్ కోఆప్షన్ కోసం దరఖాస్తులు స్వీకరణ

0చూసినవారు
మంచిర్యాల: మున్సిపల్ కోఆప్షన్ కోసం దరఖాస్తులు స్వీకరణ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ పదవులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ అన్వేష్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు ముగ్గురు సభ్యులు (ఒక మహిళ), అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు (ఒక మహిళ) అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్