మంచిర్యాల: ముకారాం చౌరస్తాలో బైక్ చోరీ

73చూసినవారు
మంచిర్యాల: ముకారాం చౌరస్తాలో బైక్ చోరీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖరాం చౌరస్తాలో బైక్ చోరీకి గురైనట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. చౌరస్తాలో నివాసం ఉంటున్న భరత్ ఈనెల 11న తన ద్విచక్ర వాహనాన్ని రోజు మాదిరిగానే ఇంటి ముందు నిలిపి ఉంచాడు. గురువారం రాత్రి చూసేసరికి బైకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్