మంచిర్యాల జిల్లాలోని ర్యాలీ గ్రామంలో ఫారెస్ట్ బీట్ అధికారి మధుకర్ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 13న విధులు నిర్వహిస్తుండగా అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ అడ్డుకొని రేంజ్ ఆఫీసుకు తరలిస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్ యజమాని మునీర్ మరో ముగ్గురు అడ్డుకొని బీట్ ఆఫీసర్ మధుకర్ అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు.