రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులకు ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం 2026 నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.