రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బుధవారం రాత్రి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సీపీ ఆదేశించారు.