మంచిర్యాల: ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి

76చూసినవారు
మంచిర్యాల: ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి
మంచిర్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలిసి జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాల్లో పిల్లలను చేర్పించే సమయంలో ఆధార్ కార్డు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏడుగురు అనాధలకు ఆధార్ కార్డు జారీ చేశామన్నారు.