హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన గొల్ల రవీందర్ (35) గురువారం గూడెం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసవడం, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతున్న రవీందర్, భార్య కూరగాయలు అమ్మడానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో, అనుమానంతో నది వద్దకు చేరుకున్న భార్య, రవీందర్ మృతదేహాన్ని గుర్తించింది. ఎస్సై తహిసినొద్దీన్ వివరాలు వెల్లడించారు.