మంచిర్యాల: మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలి

3చూసినవారు
మంచిర్యాల: మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలి
హైదరాబాద్ నుండి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడిన రాష్ట విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వసతుల కల్పన, అధార్/అపార్ పురోగతి, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణ పురోగతి, కస్తూరిబా గాంధి, ఆదర్శ పాఠశాలల ఎస్ ఎస్ సి, ఇంటర్ తప్పిన విద్యార్థులకు ఇచ్చిన పై శిక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్