మంచిర్యాల జిల్లాలో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రావుఫ్ ఖాన్, జిల్లా క్రీడల అధికారి హనుమంత్ రెడ్డి కలిసి ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా, దివ్యాంగులు ఏ రంగంలోనూ వెనుకబడి లేరని, ప్రస్తుత శాస్త్ర సాంకేతిక యుగంలో వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.