మంచిర్యాల రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్ రవి ప్రసాద్, తనకంటే పెద్ద హోదాలో ఉన్న యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, కానిస్టేబుల్ అర్ధనగ్నంగా నడిరోడ్డుపై భార్యను చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భార్య ఫిర్యాదుతో రవి ప్రసాద్ ను సస్పెండ్ చేశారు.