మంచిర్యాల జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయకులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31,435 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారికి చదువు నేర్పించడానికి 3013 మంది వాలంటరీ టీచర్లను సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు ఓబీలకు, వివోఏలకు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పి లతో శిక్షణ ఇస్తామని వివరించారు.