మంచిర్యాల: ట్రాక్టర్ రోటవేటర్ మీద పడి ఒకరి మృతి

988చూసినవారు
మంచిర్యాల: ట్రాక్టర్ రోటవేటర్ మీద పడి ఒకరి మృతి
దండేపల్లి మండలం ద్వారకా గ్రామానికి చెందిన తోట సంతోష్(35) అనే రైతు, కౌలుకు తీసుకున్న భూమిని ట్రాక్టర్‌తో దున్నుతుండగా రోటవేటర్‌లో మట్టి ఇరుక్కుపోయింది. మట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రం అతనిపై పడటంతో మృతి చెందాడు. డ్రైవర్ సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంతోష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్