చెక్ బౌన్స్ కేసులో కిషన్ రావుకు ఏడాది జైలు శిక్ష విధించడంతోపాటు అప్పుగా తీసుకున్న 20 లక్షలు మొత్తం చెల్లించాలని మంచిర్యాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి నిరోశ తీర్పునిచ్చినట్లు కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. హాజీపూర్ కు చెందిన రాజేశ్వరరావు వద్ద కిషన్ రావు 20 లక్షలు అప్పుగా తీసుకోగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.