మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ 3 పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రాజీవ్ నగర్ నుంచి నస్పూర్ 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. గీతా మందిర్, తిలక్ నగర్, సూర్య నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.