తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల్, కొమరంభీం, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.