మంచిర్యాలలోని పాఠశాలలో ఋషి కుమార్, బ్లెస్సి, అక్షిత్, అశ్విత్ అనే విద్యార్థులను చితకబాదిన ఘటనపై వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, తిరుపతి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్ ను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.