మంచిర్యాల జిఆర్పి పోలీసులు స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 08 గ్రాముల బంగారు లాకెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.