బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 2, 7, 8, 24, 45 డివిజన్లలో బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్ రావ్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన పేర్కొన్నారు.