మంచిర్యాల: దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం

3చూసినవారు
మంచిర్యాల: దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం
రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో సదరం సాఫ్ట్ వేర్ లో నమోదైన, ఆసరా పింఛన్లు పొందుతున్న దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ ఆదివారం తెలిపారు. ఈ సంఘాల ద్వారా దివ్యాంగులకు బ్యాంకు రుణాలు, స్త్రీ నిధి రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.